మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్(ఎంఎస్‌సీఐ) దేశీయ ఇండెక్స్‌కి సంబంధించి డీఎల్‌ఎఫ్‌ను తన పోర్టుఫోలియోకి జోడించింది. ఫలితంగా ఈ షేరు శుక్రవారం సెషన్‌లో 6 శాతం లాభపడి ట్రేడవుతోంది. అంతేకాకుండా కంపెనీ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 19 శాతం వృద్ధి చెందింది. ఈ అంశాలతో పాటు నిలిచిపోయిన ఇళ్ల ప్రోజెక్టులను పూర్తిచేసేందుకు, కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సహకారంతో రూ. 25,000 కోట్ల విలువైన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి(ఏఐఎఫ్)ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యింది. ఈ చర్యతో రియల్టీ షేర్లు గత కొన్ని సెషన్ల నుంచి పాజిటివ్ దృక్పథంతో ట్రేడవుతున్నాయి. డీఎల్‌ఎఫ్ షేరు శుక్రవారం సెషన్‌లో ఉదయం 10.34 సమయానికి 5.95 శాతం లాభపడి రూ. 203.95 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 192.50 వద్ద ముగిసిన ఈ షేరు, శుక్రవారం సెషన్‌లో రూ. 196.00 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమయ్యి, రూ. 205.50 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.
ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ.., ప్రైవేట్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తున్న కారణంగా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ శుక్రవారం ఉదయం ట్రేడింగ్ సెషన్‌లో లాభాల్లో ట్రేడ్ అవుతోంది. నేడు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 30,571.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ ఆల్‌టైం స్థాయికి అందుకోవడం, యస్‌బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఆర్‌బీఎల్, ఇండస్ ఇండ్
ఈనెల 26 నుంచి అమలు ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌స్టాన్లీ కాపిటల్ ఇంటర్నేషనల్) సూచీ అర్ధవార్షిక పునఃసమీక్ష జరిగింది. ఈ సమీక్షలో భాగంగా ఎంఎస్‌సీఐ ఇండియా సూచీతో పాటు మరికొన్ని సూచీలకి కొత్తగా కొన్ని షేర్లను కలపడం, ఉన్నవాటిలో కొన్నింటిని తీసివేయడం జరిగింది. ఈ మార్పులు నవంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయి(ఆరోజు మార్కెట్ ట్రేడింగ్ అనంతరం). తాజా సమీక్షలో 78 దేశీయ స్టాకులు మార్పులకు గురయ్యాయి. భారతీయ షేర్లకు జరిగిన తాజా మార్పులు ఇలా ఉన్నాయి... = ఎంఎస్‌సీఐ