పెళ్ళి కానివారికి... ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాల్లో
హైదరాబాద్ : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్)లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. 249 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 2020 ద్వారా ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా పోస్టుల భర్తీ జరుగుతుంది. హైదరాబాద్‌లోని దుండిగల్‌లో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.
పెళ్లికాని యువతీయువకులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు, వయస్సు వేర్వేరుగా ఉన్నాయి. దరఖాస్తులకు ఈ నెల 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు www.indianairforce.nic.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. పోస్టుల వివరాలిలా ఉన్నాయి.
మొత్తం ఖాళీలు - 249
ఫ్లయింగ్ బ్రాంచ్ షార్ట్ సర్వీస్ కమిషన్ - 60
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) - 105
గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్) - 84